ఏపీ కరోనా అప్ డేట్: 6,224 పాజిటివ్ కేసులు, 41 మరణాలు

Corona cases update of Andhra Pradesh
  • గత 24 గంటల్లో 72,861 శాంపిల్స్ పరీక్ష
  • అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 890 కేసులు
  • కృష్ణా జిల్లాలో ఆరుగురి మృతి
  • తాజాగా 7,798 మందికి కరోనా నయం
ఏపీలో గడచిన 24 గంటల్లో 72,861 శాంపిల్స్ పరీక్షించగా, 6,224 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 890 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 225 కేసుల చొప్పున వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రంలో 41 కరోనా మరణాలు సంభవించాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా, 7,798 మందికి కరోనా నయం అయింది.

ఓవరాల్ గణాంకాలు చూస్తే, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. ఇప్పటివరకు 6,51,791 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 55,282 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 5,941కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Update
Corona Virus
Positive Cases
Deaths
Recovery

More Telugu News