Chittoor District: చిత్తూరు జిల్లా అగర మంగళంలో పురాతన నందివిగ్రహం ధ్వంసం

Nandi Idol destroyed in Chittoor district
  • శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో ఘటన
  • నంది విగ్రహాన్ని పెకలించి తీసుకెళ్లి పగలగొట్టిన వైనం
  • 89 మంది అనుమానితులను విచారించిన పోలీసులు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని ఓ ఆలయంలో నంది విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అగర మంగళంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది.

 ఆలయం వెనక భాగం నుంచి ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు నందిని పెకలించి ఆలయం వెనక్కి తీసుకెళ్లి పగలగొట్టారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న 89 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని, ఇందుకోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.
Chittoor District
Nandi Idol
destroyed
Temple

More Telugu News