President Of India: కేంద్ర నూతన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రాజముద్ర

President Ramnath Kovind gives nod to agriculture bills
  • నూతన వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిన కేంద్రం
  • బిల్లులకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం
  • ప్రభుత్వ అనుకూల నిర్ణయం తీసుకున్న రామ్ నాథ్ కోవింద్
కేంద్రం ఇటీవల నూతన వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ మూడు వ్యవసాయ సంబంధ బిల్లులకు రాష్ట్రపతి రాజముద్ర వేశారు. ఈ నూతన బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఓవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేక వాతావరణం ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రభుత్వ అనుకూల నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.

అయితే ఈ బిల్లులను పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపత్రి ఆమోదం  ప్రవేశపెట్టినప్పటి నుంచే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లోక్ సభ, రాజ్యసభల్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు ఆందోళనలు చేశాయి. అయినప్పటికీ ఎన్డీయే తన పంతం నెగ్గించుకుంది. అటు, ఎన్డీయే తీరుకు నిరసనగా  శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకుంది. ఆ పార్టీకి చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులతో పాటు జమ్మూ కశ్మీర్ అధికార భాషల బిల్లుకు కూడా ఆమోద ముద్ర వేశారు.
President Of India
Ramnath Kovind
Agriculture Bills
NDA
BJP
Parliament

More Telugu News