Photographer: గాల్లో ఎగురుతున్న విమానాలకు ఫొటో షూట్... వీడియో వైరల్

Mid air photo shoot video went viral
  • ఇటీవలే సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ వేడుకలకు రిహార్సల్
  • ఓ పద్ధతి ప్రకారం రావాలంటూ విమానాలకు ఫొటోగ్రాఫర్ సూచనలు
  • ప్రాణాలకు తెగించి ర్యాంప్ పై కూర్చుని ఫొటోలు తీసిన వైనం

తాజాగా యుద్ధ విమానాలకు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొన్ని ఫైటర్ విమానాలు గాల్లో ఎగురుతుండగా మరో విమానం వెనుక భాగంలో కూర్చున్న ఫొటోగ్రాఫర్ ఆ విమానాలకు సూచనలు ఇస్తూ ఫొటోలు తీస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు.

ఇంతకీ ఆ వీడియో ఏంటంటే... ఇటీవల సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా అక్కడి వాయుసేన రిహార్సల్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని విమానాలు గాల్లోకి లేవగా, మరో విమానంలో వెనుక ర్యాంప్ పై కూర్చున్ని ఫొటోగ్రాఫర్ ఎంతో సాహసోపేతమైన రీతిలో గుంపుగా ఎగురుతున్న విమానాలకు ఒక పద్ధతిలో రండంటూ సూచనలు చేశాడు.

సాధారణంగా స్టూడియోలో ఫొటోలు తీసేటప్పుడు ఫొటోగ్రాఫర్లు ఎలా సర్దుబాట్లు చేస్తుంటారో, ఈ ఎయిర్ ఫొటోగ్రాఫర్ కూడా అలాగే ఆ విమానాలను అటు రావాలి, ఇటు జరగాలి... అంటూ అడ్జస్ట్ చేస్తూ మొత్తమ్మీద వాటికి ఫొటో షూట్ చేశాడు. కొన్నివేల అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలో ర్యాంప్ పై దాదాపు గాల్లో తేలుతున్నట్టుగా కూర్చున్న ఆ ఫొటోగ్రాఫర్...  ప్రమాదం అంచున ఉన్నానని తెలిసి కూడా ఎంతో ప్రొఫెషనల్ గా వ్యవహరించిన తీరుకు నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు.


  • Loading...

More Telugu News