Chandrababu: నా బాల్యమిత్రుడు శివప్రసాద్ ఇంకా నా కళ్లముందే ఉన్నట్టుంది: చంద్రబాబు

Chandrababu responds to former MP Sivaprasad first death anniversary
  • మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రథమ వర్ధంతిపై చంద్రబాబు స్పందన
  • అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నానని వెల్లడి
  • స్మృతికి నివాళి అంటూ ట్వీట్
టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భావోద్వేగభరితంగా స్పందించారు. నా బాల్యమిత్రుడు శివప్రసాద్ ఇంకా నా కళ్లముందే ఉన్నట్టుంది అంటూ ట్వీట్ చేశారు.

మంత్రిగా, ఎంపీగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన తెలుగుదేశం నేత, సినీ, నాటక రంగ కళాకారుడు, దర్శకుడు అయిన శివప్రసాద్ స్వర్గస్తుడై ఏడాది గడచిందంటే నమ్మలేకపోతున్నానని విచారానికి లోనయ్యారు. శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళి అంటూ వ్యాఖ్యానించారు.

ఎంపీగా వ్యవహరించిన కాలంలో తన విలక్షణ వేషధారణలతో పార్లమెంటులో అనేక ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ శివప్రసాద్ మీడియా దృష్టిని ఆకర్షించేవారు. సినీ నటుడిగానూ ఎంతో గుర్తింపు అందుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. గతేడాది కిడ్నీ వ్యాధితో ఆయన కన్నుమూశారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Chandrababu
Sivaprasad
Death Anniversary
Chittoor
Telugudesam

More Telugu News