Sanjana Galrani: 'లవ్ జిహాద్' ఉచ్చులో చిక్కుకున్న నటి సంజన...  ఇదే సాక్ష్యమంటున్న ఆర్టీఐ కార్యకర్త!

RTI Activist Prashant Sambargi Sensational Comments on Actress Sanjana

  • 2018లోనే మతం మార్చుకున్న సంజన
  • సర్టిఫికెట్ ను పోస్ట్ చేసిన ప్రశాంత్ సంబర్గి
  • ఇటీవలే అరెస్ట్ అయిన సంజన

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం రిమాండ్ నిందితురాలిగా ఉన్న నటి సంజనా గల్రానీ, లవ్ జీహాద్ లో చిక్కుకున్నారని, ఆమె మతం మార్చుకుని మహీరాగా మారారని ప్రముఖ సమాచార హక్కుల కార్యకర్త ప్రశాంత్ సంబర్గి, సంచలన ఆరోపణలు చేశారు. 2018లోనే ఈ ఘటన జరిగిందని, ఆమె హిందూ మతాన్ని వీడి, ముస్లిం మతానికి మారిపోయారని చెబుతూ, అందుకు సాక్ష్యంగా ఆమె మతాన్ని మారుస్తూ ముస్లిం పెద్దలు ఇచ్చిన సర్టిఫికెట్ ను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.

కాగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజనపై బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చార్జ్ షీట్ ను రూపొందించి, కోర్టుకు అందించారు. ఆమెను దాదాపు వారం రోజుల పాటు విచారించిన పోలీసులు, పలు కీలక వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఎఫ్ఐఆర్ లో ఆమె పేరు సంజనా గల్రానీ అని మాత్రమే పేర్కొన్నారు. మహీరా అన్న పేరు ఎక్కడా లేదని తెలుస్తోంది.
ఇదిలావుండగా, డాక్టర్ గా పనిచేస్తున్న అజీజ్ అనే వ్యక్తితో సంజన ప్రేమలో పడిందని, వారి నిశ్చితార్థం కూడా జరిగిందని గతంలో కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. అయితే, కరోనా, లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడిందని కూడా వార్తలు వచ్చాయి. ఇకపై సంజనాను ఇస్లాం మతం స్వీకరించిన కారణంగా మహీరా అనే పిలవాలంటూ ప్రశాంత్ సంబర్గి వ్యాఖ్యానించారు. గతంలో ఆమె బెంగళూరు చామరాజపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ తో కలిసి శ్రీలంక టూర్ కు వెళ్లారని కూడా ఆరోపించారు.

Sanjana Galrani
Islam
RTI
Prashant Sambargi
  • Loading...

More Telugu News