Pawan Kalyan: కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి... స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan responds to Union minister Ramesh Pokhriyal tweet

  • నూతన విద్యావిధానానికి పవన్ సూచనలు
  • ట్వీట్ చేసిన కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్
  • కేంద్రానికి అభినందనలు తెలిపిన జనసేనాని

కేంద్రం నూతన విద్యావిధానం (ఎన్ఈపీ) తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కేంద్రానికి సూచనలు అందించారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ జనసేనాని పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు.

విద్యార్థులకు ప్రారంభ దశలో మాతృభాషలోనే బోధన చేయడం భారతదేశ భావితరాలకు గొప్ప శక్తినిచ్చినట్టవుతుందని పేర్కొన్నారు. తనకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్ఈపీ రూపకల్పనలో మీ బృందం చేసిన కృషికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

Pawan Kalyan
Ramesh Pokhriyal
NEP
India
Narendra Modi
  • Loading...

More Telugu News