Ragini Dwivedi: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం.. హీరోయిన్ కు సమన్ల జారీ!

Kannada actress Ragini Dwivedi summoned by CBI in drugs case

  • రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేసిన అధికారులు
  • రాత్రిలోగా సీసీబీ విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • ఇప్పటికే రాగిణి స్నేహితుడిని అరెస్ట్ చేసిన అధికారులు

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. నటి రాగిణి ద్వివేదికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేయడం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈరోజు రాత్రిలోగా సీసీబీ విచారణకు హాజరు కావాలంటూ రాగిణిని ఆదేశించారు. మరో వైపు ఈ కేసులో ఇప్పటికే రాగిణి స్నేహితుడు రవిని సీసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో రాగిణికి కూడా సంబంధాలు ఉన్నట్టు రవి విచారణలో సంకేతాలు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆమెకు సమన్లు జారీ అయ్యాయి.

మరోవైపు కన్నడ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గత నెల 20న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు నటీనటులు, మోడల్స్ పేర్లు ఉన్నాయి.

Ragini Dwivedi
Sandalwood
Drugs
CBI
Summons
  • Loading...

More Telugu News