Ramcharan: ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన రాంచరణ్

Your lives are more important says Ramcharan
  • ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు మెగా అభిమానుల మృతి
  • ఈ వార్త కలచి వేసిందన్న రాంచరణ్
  • ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ చిత్తూరు జిల్లాలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సినీహీరో రాంచరణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారనే వార్త కలచి వేసిందని చెప్పాడు.

మీ ప్రాణాల కంటే ఏదీ ముఖ్యమైనది కాదని అన్నాడు. అభిమానులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని... మీ కుటుంబ సభ్యులకు ఆవేదన కలిగించవద్దని కోరాడు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ఈ బాధాకర సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడం తప్ప మనం మరేమీ చేయలేమని... వారి లేని లోటును మనం పూడ్చలేమని రాంచరణ్ అన్నాడు. ముగ్గురి కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు.
Ramcharan
Pawan Kalyan
Fance
Death
Financial Help

More Telugu News