Prabhas: 'రాధే శ్యామ్' కోసం 6 కోట్ల సెట్.. వచ్చే నెల నుంచి షూటింగ్!

Radhe Shyam shooting to be started from next month

  • షూటింగులకు రెడీ అవుతున్న నిర్మాతలు 
  • 'రాధే శ్యామ్' కోసం ఆర్.ఎఫ్.సి.లో ఆసుపత్రి సెట్
  • సెప్టెంబర్ 20 నుంచి షెడ్యూల్ ప్రారంభం
  • ప్రభాస్ పై ఆసుపత్రి సెట్స్ లో యాక్షన్ సీన్స్

ఓపక్క కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గనప్పటికీ, ఇన్నాళ్లూ ఆగిపోయిన సినిమా షూటింగులను ఇక ప్రారంభించడానికి ఎవరికి వాళ్లు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ నిర్మాతలకు నష్టాలు ఎక్కువవుతాయన్న ఉద్దేశంతో హీరోలు కూడా షూటింగులకు సమాయత్తమవుతున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగులు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' షూటింగుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగు కోసం రామోజీ ఫిలిం సిటీలో 6   కోట్ల వ్యయంతో భారీ హాస్పిటల్ సెట్ ను వేయడం జరిగింది. ఇందులో చాలా భాగం షూటింగ్ చేయాల్సి వుందట.

సెప్టెంబర్ 20 నుంచి తాజా షెడ్యూలును ప్రారంభిస్తారనీ, మొదట పది రోజుల పాటు ప్రభాస్ లేకుండా ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ పాల్గొనే షూటింగును నిర్వహిస్తారట. ప్రభాస్ పై ఈ ఆసుపత్రి సెట్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారని సమాచారం. ఇందులో పూజ హెగ్డే కథానాయికగా నటిసున్న సంగతి తెలిసిందే!

Prabhas
Pooja Hegde
Radha Krishna Kumar
Radhe Shyam
  • Loading...

More Telugu News