Anupama Parameshvaran: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Anupama chosen for a Malayalam remake
  • మలయాళం రీమేక్ లో అనుపమ 
  • జిమ్ లో గడిపేస్తున్న బన్నీ
  • చరణ్ లో-బడ్జెట్ చిత్రాల ప్లానింగ్
*  మలయాళంలో గతేడాది వచ్చిన 'హెలెన్' చిత్రం మంచి హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో దీనిని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. అనుపమ ప్రస్తుతం తెలుగులో 'కార్తికేయ 2', '18 పేజెస్' చిత్రాలలో నటిస్తోంది.
*  ఫిట్ నెస్ విషయంలో అల్లు అర్జున్ ఎప్పుడూ పెర్ఫెక్ట్ గా ఉంటాడు. అందుకే ఇప్పుడు తదుపరి చిత్రం 'పుష్ప'లో మరింత ఫిట్ గా కనపడడం కోసం ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో జిమ్ లో ఎక్కువసేపు గడుపుతూ బాగా వెయిట్ తగ్గాడట.
*  హీరో రామ్ చరణ్ తమ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇటీవల తండ్రి చిరంజీవితో భారీ చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై చిత్ర నిర్మాణాన్ని మరింత విస్తృతం చేసే యోచనలో చరణ్ ఉన్నాడట. ఇందులో భాగంగా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ, లో-బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం ఈమధ్య పలువురు దర్శకులను పిలిపించుకుని, కథలు వింటున్నట్టు తెలుస్తోంది.
Anupama Parameshvaran
Allu Arjun
Ram Charan
Chiranjeevi

More Telugu News