Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ తండ్రిని కలిసిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

Ramdoss Athawale meets Sushant Sings family
  • సుశాంత్ తండ్రి, సోదరితో భేటీ
  • హర్యాణాలోని ఫరీదాబాద్ లో సమావేశం
  • రియా చక్రవర్తి గురించి చెప్పిన సుశాంత్ తండ్రి
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కలిశారు. హర్యానాలోని ఫరీదాబాద్ కు వెళ్లిన అథవాలే... సుశాంత్ తండ్రి కేకే సింగ్, సోదరి రాణి సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నారు. హీరోయిన్ రియా చక్రవర్తి గురించి కేంద్ర మంత్రికి సుశాంత్ తండ్రి వివరించారు. మరోవైపు, సుశాంత్ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. విచారణకు ఈరోజు రియా హాజరైంది. ఇప్పటికే రియా సోదరుడిని గంటల పాటు ప్రశ్నించారు.
Sushant Singh Rajput
Ramdas Athawale
Father
Sister

More Telugu News