KCR: ప్రగతి భవన్ లో వినాయక చవితి పూజలు చేసిన కేసీఆర్ దంపతులు... ఫొటోలు ఇవిగో!

CM KCR attends Ganesh Pooja along with his family members
  • ఇవాళ వినాయక చవితి
  • హైదరాబాదు ప్రగతి భవన్ లో వినాయక విగ్రహం ఏర్పాటు
  • పూజల్లో పాల్గొన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు
ఇవాళ గణేశ్ చతుర్థి సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాదు ప్రగతి భవన్ లో పూజలు చేశారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి కేసీఆర్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. ఐటీ మంత్రి కేటీఆర్ దంపతులు కూడా వినాయకుడికి పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన పలువురు ప్రముఖులు సైతం ఈ సందర్భంగా ప్రగతిభవన్ కు వచ్చారు. ప్రగతి భవన్ లో వినాయక పూజల నేపథ్యంలో కరోనా నివారణ చర్యలు పకడ్బందీగా అమలు చేశారు.
KCR
Ganesh Pooja
Vinayaka Chavithi
KTR
Prgathi Bhavan
Hyderabad

More Telugu News