Vijay Shankar: టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం... కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలు వైరల్!

Cricketer Vijay Shankar Engagement with Vaishali
  • వైశాలీ విశ్వేశ్వరన్ తో నిశ్చితార్థం
  • సోషల్ మీడియాలో చిత్రాలు
  • అభినందనలు తెలిపిన సహచర క్రికెటర్లు
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు వైశాలి విశ్వేశ్వరన్ అనే యువతితో నిశ్చితార్థం జరుగగా, ఆ చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే శ్రీమతితో దిగిన చిత్రాలను విజయ్ శంకర్, సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా, 2018లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ ఆడటం ద్వారా తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విజయ్ శంకర్, ఆ తరువాత మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కి ఎంపికయ్యాడు. ఇప్పటివరకూ 12 వన్డేలు, 9 టీ-20లు ఆడాడు. ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ తరఫున ఆడనున్నాడు.

ఇక విజయ్ శంకర్ పోస్టుపై స్పందించిన కేఎల్ రాహుల్, చాహల్ తదితరులు వైశాలితో జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నామని, అభినందనలని తెలిపారు. ఇటీవల మరో క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
Vijay Shankar
Vaishali
Engagement

More Telugu News