Potluri Varaprasad: కరోనా పుణ్యమా అని సినీ ఆర్టిస్టులు, క్రికెట్ లెజెండ్స్ కాలగర్భంలో కలిసిపోయారు: పొట్లూరి వరప్రసాద్

YCP leader Potluri Varaprasad says so many people passed away due to corona
  • ఆసక్తికర ట్వీట్ చేసిన పొట్లూరి వరప్రసాద్
  • వేలకొద్దీ సామాన్యులు బలయ్యారని వెల్లడి
  • కుట్రలు, కుతంత్రాలు వద్దని హితవు
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేలకొద్దీ సామాన్యులు, ఎంతోమంది సినీ ఆర్టిస్టులు, క్రికెట్ దిగ్గజాలు కరోనా పుణ్యమా అని కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు.

"ఈ విపత్తు మన సమాజంలో, మనుషుల మనసులో మార్పు తీసుకొస్తుందని భావించాను, కానీ అదే పరుగు, కుట్రలు, కుతంత్రాలతో ఉంటే మన జీవితం బూడిదలో పోసిన పన్నీరు అని తెలుసుకో సోదరా!" అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
Potluri Varaprasad
Cine Artists
Cricket Legends
Corona Virus
YSRCP

More Telugu News