Jagan: ఎమ్మెల్సీ అభ్యర్థి పెన్మత్స సూర్యనారాయణ రాజుకు బీఫారం అందజేసిన సీఎం జగన్

CM Jagan gives MLC B Form to Penmatsa Suryanarayana Raju
  • మోపిదేవి రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు
  • మూడ్రోజుల కిందటే తండ్రిని కోల్పోయిన సూర్యనారాయణ రాజు
  • చివరి నిమిషంలో మర్రి రాజశేఖర్ కు నిరాశ!

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఆ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణ రాజు (సురేశ్ బాబు)ను ఖరారు చేశారు. తాజాగా పెన్మత్స సూర్యనారాయణ రాజుకు సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బీఫారం అందజేశారు. మూడ్రోజుల కిందట సూర్యనారాయణ రాజు తండ్రి, వైసీపీ సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు దివంగతులయ్యారు. ఇప్పుడాయన కుమారుడు సూర్యనారాయణ రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి సీఎం జగన్ న్యాయం చేసినట్టు భావిస్తున్నారు.

కాగా, ఈ టికెట్ కోసం చిలకలూరిపేట వైసీపీ నేత మర్రి రాజశేఖర్, కడప జిల్లాకు చెందిన నేత ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, తోట త్రిమూర్తులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరి నిమిషం వరకు సీటు తమదేనన్న ధీమాలో ఉన్నారు. అయితే, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మరణంతో సమీకరణాలు మారిపోయాయి.

  • Loading...

More Telugu News