Penmatsa Sambasiva Raju: ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసిన జగన్

Jagan finalises Penmatsa Suresh Babu name as MLC candidate
  • ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేశ్ బాబు పేరు ఖరారు
  • దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడే సురేశ్ బాబు
  • ఆగస్ట్ 24న జరగనున్న పోలింగ్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సూర్యనారాయణ రాజు (సురేశ్ బాబు) పేరును ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలోనే ఎన్నిక జరగనుంది. దీంతో ఈ స్థానానికి సురేశ్ బాబు పేరును జగన్ ఖరారు చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా... ఆగస్ట్ 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన కుమారుడు సురేశ్ బాబుకు జగన్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News