Anupama Parameshvaran: ప్రేమకథా చిత్రంలో అనుపమ పరమేశ్వరన్!

Anupama Parameshvaran in a love story

  • నిఖిల్ హీరోగా '18 పేజెస్' చిత్రం
  • ఒక నిర్మాతగా దర్శకుడు సుకుమార్ 
  • కథానాయికగా అనుపమ ఖరారు 

అందం, అభినయం ఉన్నప్పటికీ కొందరికి సరైన అవకాశాలు రావు. అనుపమ పరమేశ్వరన్ పరిస్థితి కూడా అంతే. 'ప్రేమమ్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ మలయాళ భామ ఈ ఐదేళ్లలోనూ ఐదు సినిమాలు మాత్రమే చేసిందంటే, ఆమెకు ఇక్కడ అవకాశాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం చేసుకోవచ్చు. 'లిస్టులో నేనూ వున్నాను..' అన్నట్టుగా అప్పుడప్పుడు ఒక్కో సినిమాలో మెరుస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నుంచి అనుపమకు ఓ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

యంగ్ హీరో నిఖిల్ తో అనుపమ త్వరలో జతకట్టనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, దర్శకుడు సుకుమార్ తాజగా '18 పేజెస్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో 'కుమారి 21 ఎఫ్' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన పల్నాటి సూర్య ప్రతాప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు తాజాగా అనుపమను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ ప్రేమ కథా చిత్రంలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందుకే, అనుపమను ఎంచుకున్నట్టు చెబుతున్నారు.    

Anupama Parameshvaran
Nikhil
Sukumar
  • Loading...

More Telugu News