Sanjay Manjrekar: 'ధోనీ రిటైర్మెంటు'పై ఆసక్తికర అంశం వెల్లడించిన మంజ్రేకర్

Manjrekar reveals an interesting detail about Dhoni

  • చాన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారిన ధోనీ
  • కోహ్లీ పెళ్లి సమయంలో ధోనీతో మాట్లాడానన్న మంజ్రేకర్
  • ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్న ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి దిగి చాన్నాళ్లయింది. ఆటకు రిటైర్మెంటు ప్రకటించకపోవడంతో ధోనీ ఇప్పటికీ ప్రధాన చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాడు. ధోనీలో ఇంకా ఆడే సత్తా ఉందని కొందరు, ధోనీ తన చివరి మ్యాచ్ ఎప్పుడో ఆడేశాడని మరికొందరు చర్చను రక్తి కట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర అంశం వెల్లడించాడు.

"కోహ్లీ పెళ్లి సమయంలో ధోనీతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతుండగా, ధోనీ కెరీర్ గురించి ప్రస్తావన వచ్చింది. రిటైర్మెంట్ గురించి, ఫిట్ నెస్ గురించి అడిగితే ధోని ఇలా చెప్పాడు.... టీమిండియాలో అందరికంటే వేగంగా పరిగెత్తే ఆటగాడిని ఓడించగలిగినంత కాలం నేను ఫిట్ గా ఉన్నట్టు భావిస్తాను. ఆ విధంగా పరిగెత్తలేకపోతే మాత్రం రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని తెలిపాడు" అని మంజ్రేకర్ వివరించాడు.

కాగా, ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ తెరలేపిన నేపథ్యంలో ధోనీ ప్రాక్టీసు ముమ్మరం చేశాడు. ఐపీఎల్ లో ఆటతీరు ధోనీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Sanjay Manjrekar
MS Dhoni
Retirement
Fitness
Team India
  • Loading...

More Telugu News