Nani: ఈ టెక్నాలజీ ఏంటో.... రానా పెళ్లి నేపథ్యంలో నాని కామెంట్!

Hero Nani comments on Rana marrigae

  • రామానాయుడు స్టూడియోస్ లో రానా పెళ్లి
  • పెళ్లిని ఇళ్లవద్ద నుంచే చూసేందుకు వీఆర్ టెక్నాలజీ
  • తన సన్నిహితులకు వీఆర్ సెట్లను అందజేసిన రానా

టాలీవుడ్ అగ్రనటుడు రానా-మిహీకా బజాజ్ ల పెళ్లి హైదరాబాదు రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది. అయితే కరోనా భయంతో ఈ పెళ్లికి అతి కొద్దిమందిని మాత్రమే పిలిచారు. కానీ, రానా తన సన్నిహితులందరికీ తన పెళ్లిని లైవ్ లో చూపించేందుకు వర్చువల్ రియాలిటీ (వీఆర్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పటికే వీఆర్ టెక్నాలజీ పరికరాలను తన సన్నిహితులకు పంపించాడు. ఇప్పుడా వీఆర్ సెట్ ఉపయోగించి రానా పెళ్లిని చూస్తున్నానని యువ హీరో నాని ట్విట్టర్ లో వెల్లడించాడు. అంతేకాదు రానాపై సెటైర్ వేశాడు.

"ఓ దిగ్గజ బ్రహ్మచారి కథ ఎలా ముగిసిపోతోందో చూస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ బాబాయ్! అయినా ఈ టెక్నాలజీ ఏంటో" అంటూ స్పందించాడు. అంతేకాకుండా, వీఆర్ సెట్ లో రానా పెళ్లిని చూస్తున్న ఫొటోను కూడా పంచుకున్నాడు.

Nani
Rana
Miheeka Bajaj
Wedding
VR
Ramanaidu Studios
  • Loading...

More Telugu News