Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకుమారుల మృతి

two dead in a road accident held in krishna dist

  • విజయవాడ-అవనిగడ్డ జాతీయ రహదారిపై ప్రమాదం
  • ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన కారు
  • ప్రమాదం నుంచి బయటడిపన తండ్రి, 11 నెలల కుమారుడు

కృష్ణా జిల్లాలోని విజయవాడ- అవనిగడ్డ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారులు ప్రాణాలు కోల్పోయారు. తాడేపల్లి మండలంలోని పెనుమాకకు చెందిన కుటుంబం కారులో నాగాయలంక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఓ మహిళ, ఆరేళ్ల ఆమె పెద్ద కుమారుడు ప్రాణాలు కోల్పోగా, తండ్రి, 11 నెలల కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులను మహాలక్ష్మి (32), శ్రీమహత్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Krishna District
Vijayawada
Avanigadda
Road Accident
  • Loading...

More Telugu News