Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Shruti Hassan plays doctor role in Raviteja movie
  • డాక్టర్ పాత్ర కడుతున్న శ్రుతి హాసన్ 
  • నాగార్జున సినిమా కోసం ఇలియానా
  • శేఖర్ కమ్ముల మరో సినిమా

*  రవితేజ హీరోగా శ్రుతి హాసన్ కథానాయికగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' చిత్రం రూపొందుతోంది. ఇందులో రవితేజకు భార్యగా శ్రుతి హాసన్ ఒక డాక్టర్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
*  నాగార్జున హీరోగా 'గరుడ వేగ' ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్రకు ఇలియానాను సంప్రదిస్తున్నారట. మరికొన్ని నెలలలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరీ' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మరో చిత్రానికి అంగీకరించాడు. నారాయణదాస్ నారంగ్ తన ఎస్.వి.సీ.ఎల్.ఎల్.పీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఒక స్టార్ హీరో ఇందులో కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News