అనుకున్నట్టుగానే.. సచిన్ పైలట్ వర్గంపై సుప్రీంలో వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకున్న కాంగ్రెస్!
- సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని నిర్ణయం
- ఈ ఉదయం సుప్రీంకోర్టుకు విషయం తెలిపిన కపిల్ సిబల్
- తద్వారా గవర్నర్ ను ఇరకాటంలో పెట్టే వ్యూహం
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో విచారణలో ఉన్న సమయంలో, విషయం తేలేంతవరకూ అసెంబ్లీని సమావేశ పరచరాదని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా నిర్ణయించిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పిటిషన్ ను వెనక్కు తీసుకోవడం ద్వారా గవర్నర్ ను ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహం కూడా కాంగ్రెస్ నిర్ణయం వెనకుంది.
కాగా, ఈ ఉదయం రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన కపిల్ సిబాల్, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పాటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇది తమకు బాధను కలిగిస్తోందని, తమ క్లయింట్ తన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నారని, తాము సమస్యను కొనసాగించాలని భావించడం లేదని తన వాదన వినిపించారు.