Krishna District: కృష్ణా జిల్లాలో మళ్లీ పాములు... ప్రజల బెంబేలు!

  • నిన్న ఒక్కరోజులో 9 మంది బాధితులు
  • నాటు వైద్యం వద్దంటున్న అధికారులు
  • అన్ని పీహెచ్సీల్లో యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు
Snakes in Krishna District

వర్షాకాలం ప్రారంభం కాగానే, కృష్ణా జిల్లాలో పాముల సంచారం పెరిగింది. అవనిగడ్డ, పామర్రు ప్రాంతాల్లో విషసర్పాలు అధికంగా కనిపిస్తున్నాయి. జూలైలోనే 95 మంది పాము కాటుకు గురికాగా, నిన్న ఒక్కరోజులోనే 9 పాము కాటు కేసులు మొవ్వ పీహెచ్సీ  పరిధిలో నమోదయ్యాయి.

మరో రెండు మూడు నెలల పాటు పాముల సంచారం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఎవరినైనా పాము కరిస్తే, నాటు వైద్యుల వద్దకు వెళ్లకుండా, సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని, యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కాగా, పాముల సంఖ్య పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరమూ వర్షాకాలం ప్రారంభం కాగానే, ఈ ప్రాంతంలో విషసర్పాలు అధికమవుతాయి. ఏటా వీటి కాటుకు వందలాది మంది బలవుతుంటారు.

More Telugu News