Sachin Pilot: రూ. 35 కోట్లు ఇస్తానన్నారంటూ ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ లీగల్ నోటీసులు

Sachin Pilot Sends Legal Notice To Congress MLA On Rs 35 Crore Bribery Allegation

  • బీజేపీలో చేరితే రూ. 35 కోట్లు ఇస్తానన్నారు
  • నేనా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లా: మలింగ
  • అవి తప్పుడు, నిరాధార ఆరోపణలు: సచిన్

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరితే రూ. 35 కోట్లు ఇస్తానని ఆశపెట్టారంటూ రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ్ చేసిన ఆరోపణలపై సచిన్ పైలట్ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు పంపారు. తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని సచిన్ పేర్కొన్నారు. ఆయన ఆరోపణలు తనను విస్మయానికి గురిచేశాయని అన్నారు.

సోమవారం ఎమ్మెల్యే మలింగ విలేకరులతో మాట్లాడుతూ.. తాను సచిన్ పైలట్‌తో మాట్లాడానని, ఈ సందర్భంగా ‘నువ్వెంత ఆశిస్తున్నావ్?’ అని అడిగారని అన్నారు. ఆ వెంటనే రూ. 35 కోట్లు అంటూ ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అయితే, ఆయన ఆఫర్‌ను తాను తిరస్కరించానని, విషయాన్ని సీఎం గెహ్లాట్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఎమ్మెల్యే ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి.

Sachin Pilot
Rajasthan
Ashok Gehlot
MLA Giriraj Singh Malinga
  • Loading...

More Telugu News