Sachin pilot: ఎమ్మెల్యేలను హోటల్‌లో ఉంచకపోతే.. బీజేపీ అనుకున్నంత పనీ చేసేది: సీఎం అశోక్ గెహ్లాట్

Ashok Gehlot fires on BJP
  • ఇలాంటిదేదో జరగబోతోందని ముందే ఊహించాం
  • మేం జాగ్రత్త పడకుంటే బీజేపీ కొనేసేదే
  • అందంగా తయారైతే సరిపోదంటూ పైలట్‌పై విసుర్లు
తమ ఎమ్మెల్యేలను కనుక పది రోజులపాటు ఓ హోటల్‌లో ఉంచకపోయివుంటే కనుక బీజేపీ అనుకున్నంత పనీ చేసేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. జైపూర్‌లో జరిగిన బేరసారాల్లో బీజేపీ ప్రమేయం ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇలాంటిదేదో జరగబోతోందని ముందే ఊహించి తమ ఎమ్మెల్యేలను పది రోజులుగా ఓ హోటల్‌లో ఉంచామని, తామలా చేసి ఉండకపోతే మనేసర్‌లో కొనుగోళ్లు పూర్తయి ఉండేవని గెహ్లాట్ పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని ప్రస్తుత పరిణామాలన్నిటికీ బీజేపీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్‌పైనా గెహ్లాట్ విరుచుకుపడ్డారు. అందంగా తయారై ఇంగ్లిష్‌లో మాట్లాడితే సరిపోదని, భావజాలం, నిబద్ధత, దేశంపై గుండెల్లో కొంత చోటు ఉండాలని అన్నారు.
Sachin pilot
Ashok Gehlot
Rajasthan
Congress
BJP

More Telugu News