Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక వాట్సాప్‌లో సమన్లు!

Now can send summons on whatsapp
  • కరోనా నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులు
  • సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం
  • ఇకపై సమన్లు నోటీసులను ఈ-మెయిల్, వాట్సాప్, ఫ్యాక్స్ చేయొచ్చన్న ధర్మాసనం
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో వినూత్న మార్పులు సంభవిస్తున్నాయి. వైరస్ నుంచి దూరంగా ఉండేందుకు పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును ఉపయోగించుకుంటుండగా, మీటింగుల కోసం జూమ్, జియోమీట్, గూగుల్ మీట్‌ వంటివి పుట్టుకొచ్చాయి. ఇక, పెళ్లిళ్లు, శుభకార్యాల రూపు కూడా క్రమంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ క్రమంలో ఇకపై కోర్టు సమన్లు, నోటీసులను ఈ-మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ వంటి వాటి ద్వారా పంపించ వచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జిస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి ఈ మేరకు నిర్ణయించింది.
Supreme Court
Whatsapp
Email
summons

More Telugu News