CBSE: విద్యార్థులపై భారం పడకుండా... 30 శాతం సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ

CBSE rationalised syllabus due to corona pandemic
  • దేశంలో కరోనా తీవ్రం
  • ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సిలబస్ తగ్గింపు
  • 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతుండడంతో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. తాజాగా సీబీఎస్ఈ కూడా 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ ను కుదిస్తున్నామని వెల్లడించింది.

ఈ నిర్ణయం 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపింది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అయితే, సిలబస్ కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని స్పష్టం చేశారు.
CBSE
Syllabus
Corona Virus
Ramesh Pokhriyal
India

More Telugu News