Bhanumati Ramakrishna: రేపు విడుదల కానున్న చిత్రం టైటిల్ లో మార్పు!

Title change for Bhanumati Ramakrishna movie
  • నవీన్ చంద్ర, సలోని జంటగా 'భానుమతి రామకృష్ణ'
  • రేపు 'ఆహా' ఓటీటీ ద్వారా విడుదల
  • హైకోర్ట్ కి వెళ్లిన భానుమతి తనయుడు  
  • 'భానుమతి అండ్ రామకృష్ణ'గా మార్పు
ఒక్కోసారి సినిమా టైటిళ్లు విడుదల సమయంలో మారుతుంటాయి. దీనికి చాలా కారణాలుంటాయి. అందులో ప్రధానమైనది టైటిల్ వివాదాస్పదం కావడమే! దాంతో చివర్లో మరో కొత్త టైటిల్ని నిర్ణయిస్తుంటారు. తాజాగా 'భానుమతి రామకృష్ణ' సినిమా విషయంలో కూడా అదే జరిగింది.

నవీన్ చంద్ర, సలోనీ లూత్ర హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. థియేటర్లు మూతబడివున్నందున ఈ చిత్రాన్ని 'ఆహా' ఓటీటీ ప్లేయర్ ద్వారా రేపు విడుదల చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం విడుదల సన్నాహాలలో వుండగా, ప్రముఖ నటి దివంగత భానుమతి తనయుడు మద్రాస్ హైకోర్టులో ఈ చిత్రం టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేయడం జరిగింది.

భానుమతీ రామకృష్ణగా ప్రసిద్ధురాలైన తన తల్లి పేరును ఈ టైటిల్ స్పురింపజేస్తోందనీ, తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా దీనికి ఈ టైటిల్ నిర్ణయించారనీ ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. దీంతో టైటిల్ మార్చమంటూ హైకోర్టు చిత్ర నిర్మాతకు ఆదేశాలు ఇవ్వడంతో, ఈ టైటిల్ని 'భానుమతి అండ్ రామకృష్ణ'గా స్వల్పంగా మార్చినట్టు తెలుస్తోంది.
Bhanumati Ramakrishna
Naveen Chandra
Saloni
Aha

More Telugu News