Prabhas: ప్రభాస్ తాజా చిత్రంలో రానా గెస్ట్ అప్పీయరెన్స్?

Rana Daggubati guest role in Prabhas latest film

  • రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తాజా చిత్రం
  • రెండు నిమిషాల గెస్ట్ పాత్రలో రానా
  • హైదరాబాదులో ఆసుపత్రి, యూరప్ సెట్
  • ఆగస్టు నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగ్

ప్రభాస్, రానా అభిమానులకు ఇది శుభవార్త లాంటిదే అని చెప్పచ్చు. ఎందుకంటే, 'బాహుబలి' తర్వాత వీరిద్దరూ కలసి మళ్లీ ఓ సినిమాలో కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన తాజా చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో రెండు నిమిషాల నిడివి గల ప్రత్యేక గెస్ట్ పాత్రలో రానా కనిపిస్తాడని సమాచారం. ఈ పాత్ర ప్రేక్షకులకు థ్రిల్ నిస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి 'రాధే శ్యామ్', 'ఓ డియర్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.  

ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగును లాక్ డౌన్ కు ముందు ఇటలీ, జార్జియాలలో నిర్వహించారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో తదుపరి షూటింగును హైదరాబాదులోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం స్టూడియోలలో పెద్ద ఆసుపత్రి సెట్ ను, యూరప్ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ ను, ఓ భారీ ఓడ సెట్ ను వేస్తున్నారు. ఈ పనులు పూర్తికావడానికి నెల రోజుల సమయం పడుతుందని, ఆగస్టు నుంచి షూటింగ్ మొదలెడతామని చిత్రం యూనిట్ చెబుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.    

Prabhas
Rana
Pooja Hegde
Radha Krishna
  • Loading...

More Telugu News