చైనా నుంచి వచ్చే విద్యుత్ పరికరాలతో చాలా డేంజర్: కేంద్రం హెచ్చరిక
- చైనా పరికరాల్లో మాల్వేర్లు ఉండే అవకాశం
- యుద్ధం వస్తే విద్యత్ గ్రిడ్ కుప్పకూల్చేయగల మాల్వేర్లు
- ఫైర్ వాల్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రమంత్రి వెల్లడి
ఇప్పటి కాలంలో విద్యుత్ రంగం కూడా ఎంతో వ్యూహాత్మక అంశంగా మారిందని, ఒక దేశంలోని కంపెనీలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. అందుకే దేశంలోని విద్యుత్ రంగాన్ని దెబ్బతీసేందుకు శత్రుదేశం ప్రయత్నిస్తుందని వివరించారు. కానీ, భారత్ తన శత్రుదేశాలకు ఇలాంటి అవకాశం ఇవ్వబోదని, ఇలాంటి విపత్తును ఎదుర్కొనేందుకు ఫైర్ వాల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందుకోసం పూర్తిగా భారత్ లో తయారైన పరికరాలే ఉపయోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.