Cyber Criminals: 'బాహుబలి' పేరుతో సైబర్ నేరగాళ్ల విజృంభణ

  • ఓటీటీల్లో డబ్బులిస్తేనే కంటెంట్ చూసేందుకు అనుమతి
  • ఫ్రీ కంటెంట్ పేరిట సైబర్ గాలం
  • మాల్వేర్ డౌన్ లోడ్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల పాలు
Cyber criminals uses hit cinema names to lure users

ఇంటర్నెట్ అనేది ఓ మహాసాగరం వంటిది. వెదికిన వాళ్లకి వెదికినంత! ఒక్కసారి ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెడితే వినోదానికి కొదవుండదు. సమస్త ప్రాపంచిక విషయాలకు ఇది నెలవు. అయితే, ఇటీవల ఓటీటీల రంగప్రవేశంతో కొన్ని రకాల కంటెంట్ ను డబ్బులు చెల్లించి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉచితంగా కంటెంట్ అందించే వేదికలకు కూడా కొదవలేదు.

సరిగ్గా, ఈ ఫ్రీ కంటెంట్ అంశాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా మలుచుకుంటున్నారు. ఉచిత కంటెంట్ కోసం వెదికే నెటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ బాహుబలి, లవ్ ఆజ్ కల్, గల్లీ బాయ్, మర్దాని 2, చపాక్ వంటి పేర్లతో గాలం వేస్తున్నారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల సంస్థ మెకాఫీ వెల్లడించింది. తమ మాల్వేర్లు డౌన్ లోడ్ చేసుకునేలా యూజర్లను ఊరించేందుకు బాగా హిట్టయిన సినిమాల పేర్లను, ప్రజాదరణ పొందిన బుల్లితెర కార్యక్రమాల పేర్లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఒక్కసారి ఈ ఫ్రీ కంటెంట్ మాటున ఉండే మాల్వేర్లను డౌన్ లోడ్ చేసుకుంటే పాస్ వర్డుల నుంచి వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి వెళుతుందని మెకాఫీ హెచ్చరించింది.

More Telugu News