Nizamabad District: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి కారు డ్రైవర్, గన్‌మన్‌కు కరోనా

Nizamabad Rural MLA Bajireddy Car Driver and Ganman tested Positive
  • గతవారం ఎమ్మెల్యే, ఆయన భార్యకు కరోనా
  • జిల్లాకు చెందిన ఫొటో జర్నలిస్ట్, ఆయన భార్య, కుమార్తెకు కూడా
  • డ్రైవర్, గన్‌మన్‌లకు క్వారంటైన్
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆయన భార్య ఇటీవల కరోనా బారినపడగా, తాజాగా ఆయన కారు డ్రైవర్, గన్‌మన్‌ లకు కూడా కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు వారిని క్వారంటైన్‌కు పంపినట్టు తెలుస్తోంది. కాగా, జిల్లాకు చెందిన ఓ ఫొటో జర్నలిస్టుతోపాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన భార్య, కుమార్తెకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
Nizamabad District
Bajireddy Govardhan
Corona Virus
Gunman
car driver

More Telugu News