బోయపాటి సినిమాలో ముఖ్య పాత్రలో నవీన్ చంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బోయపాటి సినిమాలో ముఖ్య పాత్రలో నవీన్ చంద్ర

Naveen chandra special role in Balakrishnas film
  • ప్రత్యేక పాత్రలలో కూడా నటిస్తున్న నవీన్ 
  • బాలకృష్ణ హీరోగా బోయపాటి సినిమా 
  • నెగటివ్ టచ్ తో సాగే ముఖ్య పాత్రలో నవీన్  
కొందరు యంగ్ హీరోలు ఓపక్క హీరోగా నటిస్తూనే, అప్పుడప్పుడు మరికొన్ని సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలను పోషిస్తుండడం మనం చూస్తూనే వుంటాం. స్టార్ హీరోల సినిమా కావడం.. స్టార్ డైరెక్టర్ల నుంచి ఆఫర్ రావడం వంటి సందర్భాలలో ఇలా నటిస్తుంటారు. టాలెంటెడ్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న నవీన్ చంద్ర కూడా ప్రస్తుతం అలాగే ఓ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించనున్నాడు.

'అందాలరాక్షసి' చిత్రంతో హీరోగా పేరుతెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా నటించినా, మరికొన్ని సినిమాలలో స్పెషల్ క్యారెక్టర్లు కూడా పోషించాడు. ఇప్పుడు అదే కోవలో బోయపాటి శ్రీను నుంచి ఆఫర్ రావడంతో ఓకే చెప్పేశాడు. బాలకృష్ణ హీరోగా బోయపాటి రూపొందిస్తున్న భారీ చిత్రంలో ఓ నెగటివ్ టచ్ తో సాగే పాత్ర కోసం నవీన్ ను అడిగినట్టూ, ఆయన ఓకే చెప్పినట్టూ తాజా సమాచారం.
Naveen Chandra
Boyapati Sreenu
Balakrishna

More Telugu News