aspirin tablet: గుండె జబ్బు లేకున్నా ఆస్ప్రిన్ వేసుకుంటున్నారా?.. అయితే ముప్పు తప్పదు: అధ్యయనం

Dont use Aspirin Tablet without Doctor

  • గుండె జబ్బు ముప్పును 17 శాతం తగ్గిస్తుంది
  • ఆస్ప్రిన్ వేసుకుంటే పేగుల్లో రక్తస్రావం ముప్పు 47 శాతం ఎక్కువ
  • మెదడులో రక్తస్రావం అయ్యే చాన్స్ 34 శాతం

గుండె జబ్బు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆస్ప్రిన్ మాత్రలు వేసుకుంటున్నారా? అయితే, ఈ విషయంలో మీరు మరోమారు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే వైద్యుల సలహా లేకుండా సొంతంగా ఆస్ప్రిన్ వేసుకోవడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువని ఓ అధ్యయనం హెచ్చరించింది. ముందుజాగ్రత్త కోసం వేసుకునే ఈ మాత్రల వల్ల కొంపమునిగే అవకాశం ఉందని బ్రిటన్, ఇటలీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

గుండె జబ్బు లేకుండా ఈ మాత్రలు వేసుకుంటే గుండెజబ్బు వచ్చే ముప్పు 17 శాతం తగ్గుతుందని అయితే, పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు 47 శాతం వరకు ఉంటుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. అలాగే, మెదడులో రక్తస్రావం అయ్యే ముప్పు 34 శాతం అధికంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఆస్ప్రిన్ వాడడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

aspirin tablet
heart disease
Study
  • Loading...

More Telugu News