Corona Virus: కరోనా రెండోదశ వ్యాప్తి అనివార్యం: ఈసీడీసీ డైరెక్టర్ ఆండ్రియా అమ్మాన్

Europe should prepare for second coronavirus wave
  • అది ఎప్పుడు మొదలవుతుంది? తీవ్రత ఎంత అనేదే తేలాలి
  • ఆందోళన కలిగిస్తున్న అమ్మాన్ వ్యాఖ్యలు
  • ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
కరోనా వైరస్ వెలుగు చూసి అప్పుడే ఆరు నెలలు అయింది. ఇప్పటికీ దాని ఉద్ధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు రష్యా, బ్రెజిల్ దేశాలను బెంబేలెత్తిస్తోంది. టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఐరోపా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం (ఈసీడీసీ) డైరెక్టర్ ఆండ్రియా అమ్మాన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తి అనివార్యమని, అయితే అది ఎప్పుడు మొదలవుతుంది? దాని తీవ్రత ఎంత అనేది మాత్రం తేలాల్సి ఉందన్నారు.

కరోనా వైరస్ ఉద్ధృతి కొంత నెమ్మదించిన నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ను సడలించాయి. దక్షిణ కొరియాలో నిన్నటి నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ఫ్రాన్స్‌లో పాఠశాలలు తెరిచినప్పటికీ అది వారం రోజుల ముచ్చటే అయింది. పాఠశాలలతో సంబంధం ఉన్న కరోనా కేసులు వెలుగుచూడడంతో స్కూళ్లను మూసివేసింది. ఇక, స్పెయిన్‌లో వచ్చే నెల ఏడో తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించేందుకు ప్రధాని పెడ్రో శాంచెజ్ పార్లమెంటు ఆమోదాన్ని కోరారు.
Corona Virus
Erope
COVID-19
ECDC
Andrea Ammon

More Telugu News