Du Wei: ఇజ్రాయెల్ లో చైనా రాయబారి అనుమానాస్పద మృతి

China envoy to Israel died in his house

  • తన నివాసంలో శవమై కనిపించిన రాయబారి
  • గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ లో చైనా రాయబారిగా నియామకం
  • నిద్రలోనే చనిపోయి ఉంటాడంటున్న ఇజ్రాయెల్ మీడియా

ఇజ్రాయెల్ లో చైనా రాయబారిగా వ్యవహరిస్తున్న డ్యు వీయ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. టెల్ అవీవ్ నగరం శివారు ప్రాంతంలోని తన నివాసంలో డ్యు వీయ్ విగత జీవుడిలా పడివుండడం గుర్తించారు. డ్యు వీయ్ వయసు 57 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలోనే ఇజ్రాయెల్ లో చైనా రాయబారిగా నియమితులయ్యారు.

అయితే, డ్యు వీయ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ మీడియా మాత్రం ఆ చైనా రాయబారి నిద్రలోనే మరణించి ఉంటాడని, సహజసిద్ధమైన ఆరోగ్య సమస్యలతోనే చనిపోయి ఉండొచ్చని పేర్కొంటోంది.

Du Wei
China
Israel
Envoy
Ambassador
Death
  • Loading...

More Telugu News