Madhavi Latha: పెళ్లికి ముహూర్తం మళ్లీ రాదా?: లాక్ డౌన్ లో పెళ్లిళ్లపై మాధవీలత కామెంట్

What is the necessity to marry in lockdown time questions actor Madhavi Latha

  • లాక్ డౌన్ లో పెళ్లిళ్లపై విమర్శలు
  • కొన్నాళ్లు ఆగ‌లేని వాళ్లు సంసారాలు చేస్తారా?
  • మాస్కుల ముసుగులో పెళ్లి అవసరమా? అని వ్యాఖ్య

లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సొంత ఊరు చేరుకోవడానికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు నానా తంటాలు పడాల్సి వస్తోంది. పెళ్లి కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా కాకుండా... ఏదో పట్టుమని పది మంది మధ్య కానిచ్చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్యే సినీ హీరో నిఖిల్, మరి కొందరు సినిమా వాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో, సినీ నటి మాధవీలత వివాదాస్పద కామెంట్స్ చేసింది. 'పెళ్లికి ముహూర్తం మళ్లీ రాదా? ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాది. పిల్ల దొరకదా? పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే వాళ్లతో పెళ్లి, బంధాలు ఎందుకు? మాస్కుల ముసుగులో పెళ్లిళ్లు అవసరమా? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు... సంసారాలు చేస్తారా?' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు... చివర్లో తన పోస్ట్ తన ఇష్టమని, తన భావాలను చెప్పే హక్కు తనకుందని తెలిపింది.

Madhavi Latha
Tollywood
Lockdown
Marriages
  • Loading...

More Telugu News