Ram: ఒక రేంజ్ లో దూసుకుపోయిన 'రెడ్' టీజర్

RED Movie
  • కిషోర్ తిరుమల నుంచి 'రెడ్'
  • ద్విపాత్రాభినయంతో రామ్
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు  
రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' సినిమా రూపొందింది. నివేదా పేతురాజ్ .. మాళవిక శర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఏప్రిల్  9వ తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే ఈ లోగా కరోనా వైరస్ విజృంభించడం .. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడటం జరిగిపోయింది. 

కరోనా కాలు పెట్టడానికి ముందే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో వదిలిన ఈ టీజర్ ను ఇంతవరకూ కోటి మందికి పైగా వీక్షించడం విశేషం. సిద్ధార్థ్ - ఆదిత్య అనే రెండు పేర్లతో ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒక పాత్రలో సాఫ్ట్ లుక్ తో .. మరో పాత్రలో రఫ్ లుక్ తో ఆయన నటన ఆకట్టుకుంటోంది.  ఇంతకుముందు రామ్ నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వంటి మాస్ హిట్ రావడంతో, సహజంగానే 'రెడ్' పై భారీ అంచనాలు వున్నాయి.  రామ్ -  కిషోర్ తిరుమల కాంబినేషన్లో మరో హిట్ పడుతుందేమో చూడాలి.
Ram
Niveda Peturaj
Malavika Sharma
Red Movie

More Telugu News