Assom: వలస కార్మిక కుటుంబాల ప్రాంతాలన్నీ కంటైన్ మెంట్ జోన్లే: అసోం కీలక ఆదేశాలు

Assom Orders Migrent Family Houses are Containment Zones

  • కుటుంబీకులెవరూ బయటకు వచ్చేందుకు వీల్లేదు
  • 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి
  • అసోం ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వలసదారుల కుటుంబాలు నివసించే గృహాలన్నీ కంటైన్ మెంట్ జోన్లుగానే పరిగణించాలని అసోం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.  వారంతా 14 రోజులపాటు విధిగా హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలని, లాక్ డౌన్ నిబంధనలన్నీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

కాగా, న్యూఢిల్లీ నుంచి వలస కార్మికులతో బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం నాడు అసోం చేరుకోగా, కేసులు లేని రాష్ట్రంగా గుర్తింపు ఉన్న అసోం, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల కారణంగా రాష్ట్రంలో వైరస్ ప్రబలకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కార్మికులు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ వివరించారు.

ఎవరైనా వ్యక్తి, బయటి రాష్ట్రం నుంచి వచ్చి, ఇంట్లోకి వెళితే, ఆ ఇంట్లోని వారంతా, అత్యవసర వైద్యం కావాల్సి వస్తే తప్ప బయటకు వచ్చేందుకు వీల్లేదని ఆయన ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సుమారు 6 లక్షల మంది వరకూ రాష్ట్రానికి వస్తారని అంచనా వేస్తున్నామని, వారి కోసం స్కూళ్లు, కాలేజీలు, అంగన్ వాడీ కేంద్రాలను క్వారంటైన్ సెంటర్లుగా మార్చే ఆలోచనలో కూడా ఉన్నామని ఆయన తెలిపారు.

Assom
Home Quarentine
Corona Virus
Migrents
  • Loading...

More Telugu News