Vizag Gas Leak: నిపుణుల బృందం నిరంతరం పనిచేస్తోంది: విశాఖ ఘటనపై ఏపీ పోలీస్ విభాగం

AP Police update about vizag gas leakage

  • పీటీబీసీని వినియోగించి గ్యాస్ లీక్ ను అరికడుతున్నారు
  • ఎటువంటి అదనపు లీక్ లు లేవు
  • ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలిస్తున్నాం

విశాఖపట్టణంలోని గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన తాజా వివరాలను ఏపీ పోలీస్ విభాగం ప్రకటించింది. గుజరాత్ నుంచి తీసుకు వచ్చిన 500 కిలోల రసాయనం పీటీబీసీని వినియోగించి గ్యాస్ లీక్ ను అరికట్టేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అర్లీ ఎడ్యుకేషన్ రీసెర్చి (ఎన్ఈఈఐఆర్)కు చెందిన నిపుణుల బృందం నిరంతరం పని చేస్తోందని అన్నారు. ఎటువంటి అదనపు లీక్ లు లేవని తెలిపింది. ఈ ఘటనా స్థలానికి పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెప్పారు.

Vizag Gas Leak
AP Police
CSIR
NEEIR
  • Loading...

More Telugu News