Visakhapatnam District: ఐదు గ్రామాలవారు మినహా మిగతా ప్రాంతాల్లో నివాసితులు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు: విశాఖ సీపీ ఆర్కే మీనా

Visakha police commissioner Meena Statement
  • ‘ఎల్జీ పాలిమర్స్’ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది
  • ఈ సంస్థకు 2 కి.మీ. దూరంలో నివాసితులను ఖాళీ చేయమన్నాం
  • ప్రజలు ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండొచ్చు

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మొద్దని విశాఖ పోలీస్ కమిషనర్ (సీపీ) ఆర్కే మీనా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఎల్జీ పాలిమర్స్’ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు.

ఈ ఫ్యాక్టరీకి రెండు కిలో మీటర్ల దూరంలో నివసిస్తున్న వారిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఖాళీ చేయాలని కోరామని చెప్పారు. ఈ సంస్థకు చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలు మినహా మిగతా ప్రాంతాల్లో నివాసితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News