Chattisgarh: ఛత్తీస్ గఢ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.. ముగ్గురి పరిస్థితి విషమం!

  • రాయ్ గఢ్ లోని పేపర్ మిల్లులో ఘటన
  • పేపర్ మిల్లులో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా గ్యాస్ లీక్
  • ఏడుగురు కార్మికులకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక

విశాఖపట్టణంలో ఇవాళ జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. రాయ్ గఢ్ లోని పేపర్ మిల్లులో ట్యాంక్ శుభ్రం చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం మేరకు రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిల్లుకు సమీపంలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించారు.

  • Loading...

More Telugu News