Sivaji Raja: నటుడు శివాజీ రాజాకు స్టెంట్ వేయనున్న వైద్యులు

Operation for Actor Sivaji Raja Tomorrow

  • నిన్న రాత్రి గుండెపోటుతో ఆసుపత్రికి
  • ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్న శివాజీ రాజా
  • మీడియాతో మాట్లాడిన శివాజీ రాజా తనయుడు విజయ్

తెలుగు చిత్ర సీమలో హీరోగా రాణించి, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన సీనియర్ నటుడు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చిందన్న వార్త సినీ వర్గాల వారిని షాక్ కి గురిచేసింది. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబీకులు ఆయనను బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన తనయుడు విజయ్ రాజా, తన తండ్రికి, వైద్యులు స్టెంట్ వేయాలని నిర్ణయించారని తెలిపారు.

ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారని తెలిపిన విజయ్ రాజా, ప్రస్తుతం ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిపారు. కాగా, శివాజీరాజాకు గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ఇంటికి రావాలని అభిలషించారు.

Sivaji Raja
Heart Attack
Vijay Raja
Doctors
Tollywood
  • Loading...

More Telugu News