Lockdown: ఏప్రిల్ లో గృహ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది: ఏపీ విద్యుత్ శాఖ

Due to Lock down  domestic power consumption increased

  • గృహ విద్యుత్  వినియోగానికి సంబంధించి ఐదేళ్ల గణాంకాలు పరిశీలించాం
  • మార్చి, ఏప్రిల్ లలో వినియోగం 46:54 నిష్పత్తిలో ఉంది
  • ఏప్రిల్ లో విద్యుత్ వినియోగంలో 4 శాతం మేర మార్చిలో చేర్చాం

ఏప్రిల్ మాసంలో గృహ విద్యుత్  వినియోగం భారీగా పెరిగిందని ఏపీ విద్యుత్ శాఖ పేర్కొంది. ‘కరోనా’, లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని పేర్కొంది. గృహ విద్యుత్  వినియోగానికి సంబంధించి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మార్చి, ఏప్రిల్ మాసాల్లో వినియోగం 46:54 నిష్పత్తిలో ఉందని పేర్కొంది. ఏప్రిల్ విద్యుత్ బిల్లు మీటర్ రీడింగ్ ద్వారా తీయలేదని తెలిపింది.

ఏప్రిల్ నెల విద్యుత్ వినియోగంలో 4 శాతం మేర మార్చి నెలలో చేర్చామని, తద్వారా ఏప్రిల్ నెల బిల్లు శ్లాబు తగ్గిందని పేర్కొంది. 2020-21లో ఏ నెలకు ఆ నెల విద్యుత్ వాడకంపైనే శ్లాబ్ రేటు ఉంటుందని, అందుకే, ఏప్రిల్ లో అసలు వినియోగం కంటే తక్కువ బిల్లులు వచ్చాయని స్పష్టం చేసింది. మార్చిలో విద్యుత్ వాడకం నాలుగు శాతం అదనంగా చేరడం వల్ల శ్లాబు రేటు పెరగలేదని వివరించింది. మార్చి, ఏప్రిల్ మాసాల విద్యుత్ బిల్లుల పూర్తి వివరాలను వినియోగదారులకు ఎస్ఎంఎస్ చేస్తామని తెలిపింది.

Lockdown
Electricity bills
Domestic power consumption
  • Loading...

More Telugu News