Nanditha Swetha: పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నందిత శ్వేత

IPC 376 Movie
  • నందిత శ్వేత ప్రధాన పాత్రధారిగా 'ఐపీసీ 376'
  • దర్శకుడిగా రామ్ కుమార్ సుబ్బరాయన్
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల  

నందిత శ్వేత పేరు వినగానే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమె అంత గొప్పగా నటించింది. ఆ తరువాత కూడా ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె తాజా చిత్రంగా 'ఐపీసీ 376' రూపొందుతోంది. నాయిక ప్రాధాన్యత కలిగిన కథ ఇది. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.

ఈ రోజున నందిత శ్వేత పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా యూనిట్ ఆమె పోస్టర్ ను విడుదల చేసింది. నేరస్థుల ఆటకట్టించడానికి సిద్ధమైన పోలీస్ ఆఫీసర్ గా గన్ పట్టుకుని ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News