Vijay Sai Reddy: ఛత్తీస్ గఢ్ కిట్లకు జగన్ తెప్పించిన కిట్లకు తేడా ఉంది: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy explains about rapid testing kits

  • కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించిన ఏపీ
  • పచ్చ మాఫియా ఏడుపు మొదలుపెట్టిందన్న విజయసాయి
  • ఏపీ కిట్లు పది నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలిస్తాయని వెల్లడి

ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై రాజకీయ చర్చ నడుస్తోంది. ఈ విషయంలో స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. శవాల మీద పేలాలు ఏరుకునే పచ్చ మాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై ఏడుపు మొదలుపెట్టిందని విమర్శించారు.

"ఛత్తీస్ గఢ్ ఒక్కో కిట్ రూ.337కు కొంటే మీరు రూ.700 ఎందుకు ఖర్చుపెడుతున్నారని అడుగుతున్నారు. ఛత్తీస్ గఢ్ కొన్న కిట్లు మనదేశంలోనే తయారయ్యాయి. వాటి నుంచి ఫలితం రావడానికి అరగంట పడుతుంది. కానీ సీఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించిన కిట్లు కేవలం 10 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలు చూపుతాయి" అని వివరించారు.

Vijay Sai Reddy
Chattisgarh
Andhra Pradesh
South Korea
Jagan
Corona Virus
Rapid Testing Kit
  • Loading...

More Telugu News