Beer: మంచి నీళ్ల బాటిల్స్ లో బీరును అమ్ముతున్న మెడికల్ షాప్ యజమాని... కటకటాల వెనక్కి!

Beer Sales in Medicle Shop
  • మద్యం బాబుల అవస్థను క్యాష్ చేసుకునే ప్రయత్నం
  • విషయం తెలుసుకున్న పోలీసుల రైడ్
  • తప్పించుకున్న మరో నిందితుడి కోసం గాలింపు

లాక్‌ డౌన్ కారణంగా మద్యం బాబులు, మత్తు దొరకక నానా అవస్థలూ పడుతున్న వేళ, వీరి దురవస్థను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మెడికల్ షాపు యజమానిని కటకటాల వెనక్కు పంపారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది.

 పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, లాక్ డౌన్ కారణంగా బార్లు, వైన్ షాపులు మొత్తం బంద్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగపూర్, గణేష్‌పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని నిషాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36), తన షాపులోనే బీర్ అమ్మకాలు ప్రారంభించాడు.

మంచినీళ్ల బాటిల్స్ లో బీర్ ను నింపి ఆయన అమ్మకాలు ప్రారంభించాడు. ఈ విషయం ఆనోటా, ఈనోటా పాకి, చివరకు పోలీసులకు చేరింది. దీంతో వారు సడన్ గా రైడ్ చేయగా, లీటర్ల కొద్దీ బీర్ లభించింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. ఇదే కేసులో తప్పించుకున్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News