Akkineni Amala: నాగార్జున ఉండగా మా ఇంట్లో మరొకరు వంట చేయడం ఎందుకు?: అమల

Akkineni Amala reveals cooking skill of Nagarjuna
  • సమంత ఎప్పుడైనా వంట చేశారా? అని ప్రశ్నించిన మీడియా
  • నాగ్ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వరన్న అమల
  • తనకు కూడా వంట చేతకాదని వెల్లడి
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అక్కినేని అమలను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అమల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమంత అక్కినేని కుటుంబ సభ్యుల కోసం ఎప్పుడైనా వంట చేశారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున వంటి చేయితిరిగిన కుక్ ఉండగా, మరొకరు వంట చేయడం ఎందుకని అన్నారు.

నాగ్ మంచి కుక్ అని, సమంతకు ఆ అవకాశం రాలేదని వెల్లడించారు. అంతేకాదు, తనకు కూడా వంట సరిగా రాదని అమల పేర్కొన్నారు. నాగ్ మంచి నటుడున్న సంగతి తెలుసు కానీ, ఆయనలో మంచి పాకశాస్త్ర నిపుణుడు ఉన్నాడన్న సంగతి మాత్రం తాజాగా అమల ద్వారానే వెల్లడైంది.
Akkineni Amala
Nagarjuna
Samantha
Food
Cooking

More Telugu News