Assam: ‘కరోనా’పై ప్రజలను భయపెట్టేలా వ్యాఖ్యలు చేసిన అస్సాం ఎమ్యెల్యే అరెస్టు

 Because of Irresponsible comments Assam Mla has arrested

  • సామాజిక మాధ్యమాల వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు
  • నాగోన్ ఎమ్మెల్యే అమిన్యుల్ ఇస్లామ్  అరెస్టు
  • ఓ ఆర్మీ జవాన్ సహా 33 మంది కూడా

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలకు అస్సాం ప్రభుత్వం ఒక పక్క పోరాడుతుంటే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రకటనలు చేసిన అక్కడి ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా నాగోన్ ఎమ్మెల్యే అమిన్యుల్ ఇస్లామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన్ని ఇవాళ అరెస్ట్ చేశారు. అలాగే, సామాజిక మాధ్యమాల వేదికగా ఇదే అంశంపై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఓ ఆర్మీ జవాన్ సహా 33 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Assam
Nagone
Mla
Aminuel Islam
Corona Virus
comments
arrest
  • Loading...

More Telugu News